అమరావతి: ఏ సినిమాకైనా ఎవరి సినిమాకైనా ఒకటే రేటు ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. దీని కోసం కార్యాచరణ చేసుకోవాలని కోరుతున్నామన్నారు. టాలీవుడ్‌ను విశాఖపట్నానికి విస్తరించండన్నారు. విశాఖలో స్టూడియోలకు స్థలాలు ఇస్తామన్నారు. ఒటిటి ప్లాట్ ఫామ్‌లో నెలకి 80 రూపాయలే ఖర్చవుతోందన్నారు. టికెట్ రేట్లపై నిర్ణయంలో ఒటిటిల అంశాన్నీ పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైతో పోటీ పడే సత్తా విశాఖకు ఉందన్నారు. తెలంగాణలో పోలిస్తే ఇండస్ట్రీకి ఎపి నుంచే కంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉందన్నారు. తెలంగాణ నుంచి 40 శాతం ఆదాయం వస్తే…. ఎపి నుంచి 60 శాతం వస్తోందన్నారు. ఎపికి రండి అందరికీ స్థలాలు ఇస్తామని, విశాఖ పట్నంలో జూబ్లీహిల్స్ తరహా ప్రాంతాన్ని క్రియేట్ చేద్దామన్నారు. నెటిప్లిక్స్, అమెజాన్, వంటివి ఏడాదికి వెయ్యి రూపాయలు తీసుకుంటున్నాయని గుర్తు చేశారు.