Saturday, November 16, 2024

విశాఖ హనీ ట్రాప్ కేసు.. తవ్వేకొద్దీ వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు

- Advertisement -
- Advertisement -

విశాఖ హనీ ట్రాప్ కేసులో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. నిందితురాలు జాయ్ జెమీమా పోలీసులకు ఝలక్ ఇచ్చినట్లు గుర్తించారు. 10 నెలల కిందటే ఓ వ్యాపారవేత్తను హనీ ట్రాప్ చేసి జాయ్ జెమీమా కేసు పెట్టించింది. ఆ సమయంలో జెమీమా మోసాలను పోలీసులు గుర్తించలేక పోయారు . జెమీమా ఫిర్యాదుతో అనేకమంది అమాయకులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు పోలీసులు. వరుసగా ఫిర్యాదులు రావడంతో జెమీమా మోసాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. హనీ ట్రాప్ కేసులో విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసులో తవ్వే కొద్దీ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. జాయ్ జెమీమా మోసాలు బయటపడుతున్నాయి. పెళ్లైన యువకులనే కాకుండా అనేక మంది వ్యాపారవేత్తలను సైతం జెమీమా మోసగించినట్లు పోలీసులు గుర్తించారు.

పది నెలల క్రితమే కాఫీ షాప్ కు సంబంధించిన ఒక వ్యాపారవేత్తను ట్రాప్ చేసింది. అతడి కాఫీ షాప్ కి వెళ్లిన జెమీమా తనను తాను డిజిటల్ క్రియేటర్‌గా పరిచయం చేసుకుంది. కాఫీ షాప్‌కు డిజిటల్ మార్కెటింగ్ చేస్తామంటూ అతడితో పరిచయం చేసుకుంది. ఆ తర్వాత ప్రేమగా ఉంటున్నట్లు నటించింది. ఆ తర్వాత అతడిని బెదిరించి డబ్బులు వసూలు చేయడంతో పాటు అతడిని వేధించడం మొదలు పెట్టింది. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. అందుకు ఆయన నిరాకరించడంతో తన దగ్గరున్న ఫొటోలతో చూపి అతడిని బెదిరించింది. అంతేకాదు అతడిపై కేసు కూడా నమోదు చేయించింది. పోలీసులు విచారణ చేస్తున్నా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదంటూ పోలీసులపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చింది. కమిషనర్‌ను కూడా సంప్రదించింది. అతడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ పోలీసులకు సైతం ఝలక్ ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News