Monday, December 23, 2024

‘అమెరికా’ కాల్పుల్లో విశాఖ వాసి మృతి

- Advertisement -
- Advertisement -

Visakha resident Shot dead in 'US' shooting

 

మనతెలంగాణ/హైదరాబాద్ : అమెరికాలో దోపిడీ దొంగలు జరిపిన కాల్పుల్లో మృతిచెందిన ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కలిదిండికి చెందిన చిట్టూరు సత్యకృష్ణ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. ఈక్రమంలో సత్యకృష్ణ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని తల్లిదండ్రులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం సహకరించాలని అధికారులకు విన్నవించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కలిదిండికి చెందిన చిట్టూరి సత్యకృష్ణ ఉన్నత చదువుల కోసం గత నెల అమెరికాకు వెళ్లాడు. అక్కడి అలబామా రాష్ట్రంలో ఓ స్టోర్స్ దుకాణంలో ఉద్యోగంలో చేరాడు. సత్యకృష్ణ పనిచేస్తున్న దుకాణంలో దోపిడీ దొంగలు కాల్పులకు తెగబడ్డారు. ఆ కాల్పుల్లో సత్యకృష్ణ మృతి చెందినట్లు కాలిఫోర్నియాలో స్థిరపడిన ప్రవాసాంధ్రుడు సాగర్ తెలిపారు. చదువుకునేందుకు వెళ్లిన తమ కుమారుడు తిరిగిరాని లోకాలకు చేరడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News