Monday, December 23, 2024

విశాఖలో మహిళపై అత్యాచారం?.. ఆపై హత్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఓ మహిళపై అత్యాచారం చేసి అనంతరం అతి క్రూరంగా ఆమెను హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంన జనినల్లా భోగాపురం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ మహిళ తన భర్తతో కలిసి జీవనం సాగిస్తోంది. ఓ కంపెనీలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఆమె ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండు రోజుల క్రితం కంపెనీకి వెళ్లిన భార్య తిరిగి రాకపోవడంతో ఆమె భర్త స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ నెల 11వ తేదీన గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించడంతో స్థానికులు బిమిలీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహిళ ఒంటి గాయాలు ఉండడంతో ఆమెపై అత్యాచారం చేసి అనంతరం చంపేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News