Friday, December 20, 2024

విశాఖలో దారుణం

- Advertisement -
- Advertisement -

లా విద్యార్థినిపై సామూహిక అత్యాచారం..
వీడియోలు తీసి భయపెట్టి అఘాయిత్యానికి పాల్పడ్డ వైనం
బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు
నలుగురు నిందితుల అరెస్టు, రిమాండ్

మన తెలంగాణ/హైదరాబాద్ : ఆంధప్రదేశ్‌లోని విశాఖపట్నంలో మరో దారుణమైన ఘటన వెలుగు చూసింది. న్యాయం అందకుండా అన్యా యానికి గురవుతున్న ఎంతో మందికి న్యాయసాయం చేయాలన్న ఉద్దేశంతో లా చదువుతోన్న ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. విశాఖలో న్యాయ విద్య అభ్యసిస్తోన్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు నలుగురు యువకులు.. అంతటితో ఆగకుండా, ఆ దృశ్యాలను తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. బాధితురాలని నగ్నంగా వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ వీడియోలు అడ్డం పెట్టుకుని మళ్లీ మళ్లీ అత్యాచారానికి ఒడిగట్టారు.

అయితే, పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలు మధురవాడలోని ఎన్‌విపి లా కాలేజీలో లా థర్డ్ ఇయర్ చదువుతోంది. ఆమె సహచరి విద్యార్థి అయిన వంశీతో స్నేహం చేసింది. అయితే, తాను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన వంశీ. ఈ ఏడాది ఆగస్టు 10వ తేదీన కంబాలకొండ కు తీసుకుని వెళ్లాడు. అక్కడే విద్యార్థిని ఎంత వారించినా వినకుండా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇక, మళ్లీ అదే నెల 13వ తేదీన డాబాగార్డెన్‌లో ఉంటున్న తన ఫ్రెండ్ ఆనంద్ ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత వంశీ స్నేహితులు ఆనంద్, రాజేష్, జగదీష్ కూడా అక్కడికి వచ్చి ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక, ఆ దృశ్యాలు తమ ఫోన్లలో చిత్రీకరించి..

బెదిరిస్తూ మళ్లీ మళ్లీ అఘాయిత్యానికి పాల్పడి తమ పశు వాంఛ తీర్చుకున్నారు. అయితే 2 నెలల తర్వాత మళ్లీ ఆనంద్, రాజేష్, జగదీష్.. బాధితురాలికి ఫోన్ చేసి తమ వద్దకు రావాలని కోరిన తీర్చాలని బెదిరించారు. లేకపోతే పాత వీడియోలు బయటపెడతామంటూ భయపెట్టారు.. దీంతో, ఈ విషయం వంశీ దృష్టికి బాధితురాలు తీసుకెళ్లింది. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి మోసం చేసిన వంశీ కూడా వారి కోరిక తీర్చాలంటూ మానసికంగా వేధించసాగాడు. అనునిత్యం వేధింపులు ఎక్కువ అవ్వడంతో ఈ నెల 18వ తేదీన ఫ్యాన్‌కు ఉరివేసుకుని బాధితురాలు ఆత్మాహత్యా యత్నం చేసింది. ఇది గమనించిన బాధితురాలి తండ్రి అడ్డుకుని. ఏం జరిగిందని నిలదీయడంతో అసలు విషయం బయటపెట్టింది. దీంతో విశాఖ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News