Thursday, December 26, 2024

స్లో పాయిజన్ తో ప్రియురాలి ప్రాణం తీసిన ప్రియుడు

- Advertisement -
- Advertisement -

అమరావతి: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తన ప్రియురాలుకు విషం తాగించిడంతో ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ప్రియుడు లొంగిపోయిన సంఘటన విశాఖపట్నం జిల్లా నాతవరం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వెన్నపాలెం గ్రామానికి చెంది వాసిరెడ్డి శేఖర్, శారదానగర్‌కు చెందిన రత్న మాధురితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరు సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేయడంతో గత ఆరు సంవత్సరాల నుంచి ప్రేమించుకున్నారు. కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడంతో ఇంటి దగ్గర నుంచి విధులు నిర్వహించారు.

జనవరి 27న ఇద్దరు విశాఖపట్నంలోని ఓ లాడ్డిలో కలిశారు. అదే రోజు రాత్రి ఆమెను తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్లిపోయాడు. అదే రాత్రి నుంచి ఆమె అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. యువతి బంధువులు ఫోన్ చేసి శేఖర్‌ను బెదిరిస్తే విషపు సీసా చిత్రాన్ని వాట్సాప్‌లో పంపించాడు. తమ బిడ్డపై విష ప్రయోగం జరిగింది ఆమె కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె తొమ్మిది రోజులు చికిత్స పొందిన అనంతరం ఆమె మృతి చెందింది. నిందితుడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయి నిజాలు ఒప్పుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News