Friday, December 20, 2024

బంగారాన్ని ఎత్తుకెళ్లిన నటి… అరెస్టు

- Advertisement -
- Advertisement -

అమరావతి: బంగారం దొంగతనం కేసులో యువ నటిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం ప్రాంతం పెందుర్తిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దొండపర్తిలో ప్రసాద్ తన భార్య, పిల్లలలతో కలిసి ఉంటున్నాడు. ప్రసాద్ కూతురుకు ఇన్‌స్టాగ్రామ్‌లో నటి సౌమ్య శెట్టి పరిచయమైంది. దీంతో ఇద్దరు స్నేహంగా ఉండేవారు. ఫిబ్రవరి 2న ప్రసాద్‌కు ఇంటికి సౌమ్య వచ్చింది. బెడ్‌రూమ్‌లో ఉన్న బీరువాలో ఉన్న బంగారాన్ని తీసుకొని నటి పారిపోయింది. ప్రసాద్ బీరువా తెరిచి చూడగా 74 తులాల బంగారం కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి నగలతో గోవా వెళ్లిపోయినట్టు గుర్తించి ఆమెను అక్కడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె నుంచి 40 తులాల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సౌమ్యశెట్టి పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News