Saturday, December 28, 2024

విశాఖలో రైల్వే స్టేషన్ రూఫ్ పైకి ఎక్కి వ్యక్తి హల్‌చల్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. ఆర్‌పిఎఫ్, జిఆర్‌పి పోలీసులతో పాటు ప్రయాణికులను పరుగులు తీయించాడు. రూఫ్‌టాప్ పైకి ఎక్కి విద్యుత్ తీగలను పట్టుకుంటానని బెదిరించడంతో కరెంట్ ఆఫ్ చేసి అతడిని పట్టుకొవడానికి పోలీసులు ప్రయత్నించారు. రూఫ్‌టాప్ నుంచి పూరీ-తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలు పైకి దూకాడు, దీంతో అతడిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. కానీ అతడు దొరకపోవడంతో ప్రయణికుల సాయంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని ఆస్పత్రికి తరలించారు. అతడికి మతిస్థిమితం లేదని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News