అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా కేంద్రంలో రామజోగిపేట ఘటనలో మూడో మృతదేహాన్ని వెలికితీశారు. శిథిలాల కింద చిక్కుకున్న చోటు అనే వ్యక్తి మృతదేహాన్ని వెలికితీశారు. రామజోగిపేటలో మూడంతస్థుల భవనం కూలి ఇప్పటివరకు ముగ్గురు చనిపోయారు. మృతులు అన్న, చెల్లెలు దుర్గా ప్రసాద్(17), సాకేటి అంజలి(10)గా గుర్తించారు.
భవనం కూలిన ఘటనలో బిహార్‌కు చెందిన చోటు అనే వ్యక్తి(27) దుర్మరణం చెందాడు. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడడడంతో విశాఖలోని కెజిహెచ్ ఆస్పత్రికి తరలించారు. ఐదు గంటల పాటు అగ్నిమాపక సిబ్బంది, ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎప్ బృందాలు రెస్కూ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. ప్రమాద సమయంలో భవనంలో ఎనిమిది మాత్రమే ఉండడంతో మృతుల సంఖ్య తగ్గింది. క్షతగాత్రులు కొమ్మిశెట్టి శివ శంకర్, సాకేటి రామారావు, సాకేటి కల్యాణి, సున్నపు కృష్ణ, సాతిక రోజారాణి అని అధికారులు వివరాలు వెల్లడించారు.