- Advertisement -
హైదరాబాద్: కులు మనాలి నుంచి చండీగఢ్ వెళ్తుండగా కొండ చరియలు విరిగిపడిపడడంతో ఘాట్ మధ్యలో విశాఖపట్నం కార్పొరేటర్లు ఇరుక్కుపోయారు. విశాఖ నగర పాలక సంస్థ కు చెందిన 95 మంది కార్పొరేటర్లు, కుటుంబ సభ్యులు ఈ నెల 16 నుంచి స్టడీ టూర్ లో ఉన్నారు. విశాఖ నగర పాలకులు రాత్రి నుంచి రోడ్డు పైను బస్సులోనే కాలం గడుపుతున్నారు. ఆర్మీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికి వర్షం పడుతుండడంతో రోడ్డు క్లియర్ చేసేందుకు పరిస్థితులు అనుకూలించడంలేదు. చండీగఢ్ కు 240 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. మింద్ ప్రాంతంలో జివిఎంసి పాలకులు చిక్కుకున్నారు. కులు మునిసిపాలిటీలోనే పలు ప్రాంతాలను కార్పొరేటర్లు సందర్శించారు. ఇప్పటివరకు ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, సిమ్లా, కులు మనాలి ప్రాంతాలలో కార్పొరేటర్లు పర్యటించారు.
- Advertisement -