Monday, December 23, 2024

పెళ్లి పేరుతో బోధన్ యువకుడికి వల.. భారీగా డబ్బులు వసూలు

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: పెళ్లి పేరుతో యువకుడి వద్ద నుంచి ఓ మహిళ భారీ డబ్బులు వసూలు చేసి మోసం చేసింది. ఈ ఘటన జిల్లాలోని బోధన్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వధువు కోసం మ్యాట్రిమొనీలో బోధన్ కు చెందిన ఓ యువకుడు రిజిస్టర్ చేసుకున్నాడు. మ్యాట్రిమొనీలో వివరాలు చూసిన సదరు మహిళ, యువకుడికి ఫోన్ చేసింది. కొన్నాళ్లు యువకుడితో స్నేహంగా మాట్లాడి పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించింది. కుటుంబీకులు ఆస్పత్రిలో ఉన్నారంటూ యువకుడి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసింది.

యువకుడి నుంచి పలు విడతల్లో రూ.4 లక్షలు వసూలు చేసింది. తర్వాత పెళ్లి చేసుకుందామని యువకుడు అడగటంతో నంబర్ బ్లాక్ చేసింది. దీంతో మోసపోయానని గ్రహించిన యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు.. సదరు మహిళను విశాఖకు చెందిన వివాహిత స్వాతిగా గుర్తించారు. ఆమెకు ఇప్పటికే వివాహమై ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, కుటుంబ సభ్యులతో కలిసి యువకుడిని మోసం చేసిందని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News