Wednesday, January 22, 2025

కథ మ్యూజిక్‌ని డిమాండ్ చేయాలి

- Advertisement -
- Advertisement -

Vishal Chandrasekhar about 'Sita Rama'

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో దృశ్యకావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు సంగీత ప్రియులని మైమరపించి చార్ట్ బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. ఆగస్ట్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ “సీతారామం కథను దర్శకుడు హను రాఘవపూడి చాలా గొప్పగా రాశారు. కథలో పాటలు వచ్చే సందర్భాలు అద్భుతంగా వుంటాయి. మంచి మ్యూజిక్ రావాలంటే కథ మ్యూజిక్‌ని డిమాండ్ చేయాలి. అలా మ్యూజిక్‌ని డిమాండ్ చేసిన కథ సీతారామం. ‘సీతారామం’కు గొప్ప మ్యూజిక్ రావడానికి కారణం ఈ కథ ఇచ్చిన స్ఫూర్తి.

ఈ సినిమా మ్యూజిక్ జర్నీ అద్భుతంగా సాగింది. కానున్న కళ్యాణం… పాట రాసిన సిరివెన్నెల సాంగ్ కంపోజ్ చేసినప్పుడు స్టూడియోకి రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. నాకు చాలా విషయాలు చెప్పారు. తెలుగు, తమిళ్, ఇలా అన్నీ భాషల్లోని అలంకారాలు గురించి వివరించారు. ఒకే లిరిక్‌లో డిఫరెంట్ ట్యూన్స్, డిఫరెంట్ లిరిక్స్‌లో అదే ట్యూన్ ఎలా ప్రజెంట్ చేయాలో చెప్పారు. కేకే, అనంత్ శ్రీరామ్‌లతో కూడా మంచి అనుబంధం వుంది. పాటలని డబ్బింగ్‌లా కాకుండా తెలుగు, తమిళ్. మలయాళం భాషల్లో విడివిడిగా వాటి నేటివిటికి తగ్గట్టు ఒరిజినల్ గా చేశాం. ఇంతందం… పాటని తమిళ్ కోసం డిఫరెంట్ ట్యూన్ చేశాం. ఇక ‘సీతారామం’లో మొత్తం ఆరు పాటలు ఉన్నాయి. ఇప్పటికే మూడు పాటలు రిలీజ్ అయ్యాయి. నా ఫేవరేట్ సాంగ్ ఇంకా విడుదల కావాల్సివుంది. ఇప్పటివరకూ విడుదలైన పాటల్లో ‘ఓహ్ సీత’ పాట నాకు చాలా ఇష్టం”అని అన్నారు.

Vishal Chandrasekhar about ‘Sita Rama’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News