Thursday, January 23, 2025

నేను రాజకీయాల్లోకి రావడంలేదు: విశాల్

- Advertisement -
- Advertisement -

చెన్నై: బుధవారం విశాల్ తన అభిమాన సంఘం విశాల్ మక్కల్ నల ఇయక్క నేతలతో సమావేశం కావడంతో ఆయన పార్టీ పెడుతున్నారని వార్తలు హల్‌చల్ చేశాయి. దీంతో తాను మాత్రం రాజకీయాల్లో రావడంలేదని విశాల్ స్పష్టం చేశాడు. ఆపదలో ఉన్నవారికి ఆదుకోవడమే తన లక్ష్యమని, తరువాత జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా ప్రజా సంక్షేమాన్ని ఉద్యమ రూపంలోకి తీసుకొస్తానని పేర్కొన్నారు. దేవి ఫౌండేషన్ ద్వారా ప్రతి సంవత్సరం నిరుపేద విద్యార్థులకు సహాయం చేస్తున్నామని, పేద రైతులను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

షూటింగ్ జరిగిన ప్రదేశాలలో సరైన సదుపాయాలు లేకపోతే వాటిని తెలుసుకొని పరిష్కరించానని వివరణ ఇచ్చాడు. తాను చేస్తున్న సేవ కార్యక్రమాల ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఎప్పుడు అనుకోలేదని విశాల్ తెలిపారు. తమిళ ప్రజలు కోరుకుంటే భవిష్యత్‌లో జనాల కోసం రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నానని తన ఎక్స్ ట్విట్టర్‌లో విశాల్ ఓ లేఖ విడుదల చేశారు. ఇప్పటికే స్టార్ హీరో దళపతి విజయ్ తమిళగ వెట్రి కజగం పేరుతో కొత్త రాజకీయ పార్టీ పెట్టిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News