Monday, December 23, 2024

విశాల్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ ‘మార్క్ ఆంటోని’ రేపే విడుదల

- Advertisement -
- Advertisement -

యాక్షన్ హీరో విశాల్ ‘మార్క్ ఆంటోని’ చిత్రంతో రేపు (సెప్టెంబర్ 15) థియేటర్లలోకి రాబోతున్నారు. సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ మూవీని ఎస్ వినోద్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి జీ వీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించారు. ఎస్ జే సూర్య, సునిల్ ముఖ్య పాత్రలను పోషించారు. రీతూ వర్మ హీరోయిన్‌గా నటించింది.

ఇప్పటి వరకు మార్క్ ఆంటోని నుంచి విడుదల చేసిన ప్రతీ కంటెంట్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. మరీ ముఖ్యంగా టీజర్, ట్రైలర్‌లు రిలీజ్ అయిన తరువాత సినిమా మీద అంచనాలు అమాంతం పెరిగాయి. విశాల్ మార్క్ యాక్షన్, ఎస్ జే సూర్య కామెడీ టైమింగ్, టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ఇలా అన్నీ కూడా ఆఢియెన్స్‌ను ఆకట్టుకున్నాయి.

విశాల్ ఈ సినిమా కోసం పాడిన పాట, జీవీ ప్రకాష్ అందించిన సంగీతం అందరినీ మెప్పించింది. ఇలా అన్నీ పాజిటివ్ అంశాలతో కూడుకున్న మార్క్ ఆంటోని రేపు భారీ ఎత్తున థియేటర్లోకి రాబోతోంది. తమిళ,తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కాబోతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News