Tuesday, January 28, 2025

ఇళయరాజాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఆ దర్శకుడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విశాల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సంగీత దర్శకుడు ఇళయరాజాను ఎంతో మంది ఆరాధిస్తారని, ఆలాంటి గొప్ప వ్యక్తిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తగదని దర్శకుడు మిస్కిన్‌కు నటుడు, నడిగం సంఘం జనరల్ సెక్రటరీ విశాల్ చురకలంటించారు. నలుగురిలో ఉన్నప్పుడు పద్దతిగా మాట్లాడాలని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఇప్పుడు క్షమాపణలు చెబితే సరిపోతుందా? అని నిలదీశారు. ఇళయరాజాను ఆగౌరవ పరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. మన మనసుకు అనిపించిన విషయాన్ని మాట్లాడే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంటుందని, కానీ ఇతరుల వ్యక్తత్వాలు దెబ్బతీయకూడదని సూచించారు. పద్మ అవార్డులకు ఎంపికైన నటుడు అజిత్, నటి శోభనకు విశాల్ అభినందనలు తెలిపారు. వాళ్లకు అవార్డులు వరించినందుకు చాలా ఆనందం వేసిందన్నారు.

‘తుప్పారివాలన్’ అనే సినిమాలో విశాల్ హీరోగా నటించారు. ఈ సినిమాను తెలుగులో ‘డిటెక్టివ్’ పేరుతో విడుదల చేయనున్నారు. ఈ డిటెక్టవ్ సినిమాకు మిస్కిన్ దర్శకుడిగా పని చేయడంతో పాటు నటించాడు. ‘బాటిల్ రాధ’ అనే మూవీ ఈవెంట్‌కు మిస్కిన్ హాజరయ్యాడు. స్టేజీపై మిస్కిన్ ప్రసంగిస్తూ… ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవారి కంటే తాను ఎక్కువగా మద్యం తాగానని తెలియజేశారు. ఇళయరాజా గురించి మాట్లాడుతూ… ఇళయరాజా సంగీతంతో ఎంతో మంది మద్యానికి బానిగా మారారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో మిస్కిన్‌పై ఇళయ రాజా అభిమానులు, సినీ ప్రేకక్షకులు మండిపడ్డారు. వెంటనే మిస్కిన్ క్షమాపణలు చెప్పారు. తాను సరదాగా ఆ వ్యాఖ్యలు చేశానని వివరణ ఇచ్చారు. తనని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News