Wednesday, January 22, 2025

మన్నెగూడ కిడ్నాప్ కేసులో ట్విస్ట్

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః వైద్య విద్యార్థిని కిడ్నాప్ చేసిన కేసులో నిందితుడు నవీన్‌రెడ్డిపై పోలీసులు పెట్టిన పిడి యాక్ట్‌ను హైకోర్టు సోమవారం కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా, ఆదిబట్ల పరిధిలోని మన్నెగూడలో గతేడాది డిసెంబర్ 9వ తేదీన వైద్య విద్యార్థిని వైశాలిని నవీన్‌రెడ్డి తన అనుచరులతో కలిసి కిడ్నాప్ చేశాడు. తన అనుచరులతో కలిసి ఆమె ఇంటిపై దాడి చేసి అడ్డు వచ్చిన వారిపై దాడికి తెగబడ్డారు. తనను వివాహం చేసుకునేందుకు నిరాకరించిన వైశాలిని కిడ్నాప్ చేశాడు.

వైశాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి 40మంది నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డిని గోవాలో అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే రాచకొండ పోలీసులు నవీన్‌రెడ్డిపై పిడి యాక్ట్ పెట్టి జైలుకు పంపించారు. దీనిని నవీన్‌రెడ్డి హైకోర్టులో సవాల్ చేశాడు. దీనిపై విచారణ చేసిన కోర్టు పిడి యాక్ట్‌ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News