Friday, December 20, 2024

ఓటిటిలోకి వచ్చేస్తున్న విశాల్ ‘రత్నం’ సినిమా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఎంతో హైప్ తో థియేటర్లలోకి ఏప్రిల్ 26న వచ్చిన తమిళ హిరో విశాల్ చిత్రం ‘రత్నం’ థియేటర్లలో పెద్దగా ఆదరణ పొందలేదు. ఇది విశాల్ చిత్రాలలో మరో ఫ్లాప్ చిత్రంగా నిలిచింది. సినిమా విడుదలకు ముందు టీజర్, ట్రైలర్ తో బాగా ఊదరగొట్టారు.  కానీ ప్రైక్షకులు పెద్దగా ఆసక్తిని కనబరచలేదు.

ఈ ‘రత్నం’ సినిమా ఇప్పుడు ఓటిటిలోకి రాబోతున్నది టాక్. దీనిని నిర్మాతలు కూడా ధ్రువీకరించారు. ఈ సినిమా మే 23 నుంచి ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ లో స్ట్రీమింగ్ కానున్నదని ఆ సినిమా తయారీదారులు స్పష్టం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News