Sunday, December 22, 2024

ఛత్తీస్‌గఢ్ సీఎంగా విష్ణుడియో సాయ్ ప్రమాణస్వీకారం

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా విష్ణుడియోసాయ్ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంలుగా అరుణ్ సావో, విజయ్ శర్మ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. రాయ్‌పూర్‌లో జరిగిన ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, యూపీ సిఎం యోగి ఆదిత్యనాథ్, అసోం సీఎం హిమంత బిస్వాశర్మ, ఛతీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ భగేల్‌తోపాటు పలువురు నాయకులు హాజరయ్యారు. విష్ణుడియో సాయ్ గతంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. అంతేగాక ప్రధాని నరేంద్రమోడీ తొలి క్యాబినెట్‌లో కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News