Saturday, March 29, 2025

మార్చి 1న ‘కన్నప్ప’ టీజర్ విడుదల

- Advertisement -
- Advertisement -

ప్రతిష్టాత్మక మైథలాజికల్ చిత్రం ‘కన్నప్ప’ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు సృష్టించింది. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తుండగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా చిత్రంగా భారీ బడ్జెట్‌తో డా.ఎం.మోహన్ బాబు నిర్మిస్తున్నారు. పలు ఇండస్ట్రీలకు చెందిన నటులు ఈ మూవీలో నటిస్తుండటంతో సౌత్‌తో పాటు నార్త్‌లోనూ ఈ మూవీ విడుదల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మహా శివరాత్రి పండుగను పురస్కరించుకొని ‘కన్నప్ప’ చిత్ర బృందం శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని సందర్శించింది. ఈ సినిమా టీజర్‌ను అక్కడ ప్రదర్శించారు.

ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ మంచు విష్ణు సంతోషాన్ని వ్యక్తం చేశారు. “మార్చి 1న ఈ సినిమా టీజర్ విడుదలవుతుంది. గురువారం ముంబయ్‌లో మీడియాతో సమావేశం కానున్నాం. అందరికంటే ముందుగా వారు ‘కన్నప్ప’ టీజర్‌ను చూస్తారు”అని మంచు విష్ణు తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో మోహన్‌బాబు, ప్రభుదేవా, శివ బాలాజీ, రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాలో మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 25న గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News