Wednesday, January 22, 2025

విష్ణు ప్రియతో ప్రేమపెళ్లి పై స్పందించిన జెడి చక్రవర్తి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యాంకర్ విష్ణు ప్రియ చేసిన వ్యాఖ్యలపై నటుడు జెడి చక్రవర్తి స్పందించారు. విష్ణుప్రియ తో కలిసి ఒక వెబ్ సిరీస్‌లో నటించామని, 40 రోజులు కష్టపడి ఆమె తో పని చేశానని వివరించారు. వెబ్ సిరీస్ దర్శకుడు పవన్ విష్ణుప్రియ కు ఒక సలహా ఇచ్చాడని తెలిపారు. జెడి చక్రవర్తి నటించిన సినిమాలను వీక్షించాలని ఆమె కు చెప్పాడన్నారు. దీంతో ఆమె తాను నటించిన సినిమాలు చూసి తన యాక్టింగ్ నచ్చి తన పాత్రలతో ప్రేమలో పడ్డారని చెప్పుకొచ్చారు.

ఆమె తనను ప్రేమించడంలేదని, తమ మధ్య గురుశిష్యుల అనుబంధం ఉందని జెడి చెప్పారు. ఓ సెలబ్రిటీ గేమ్ షోలో పాల్గొన్న విష్ణు ప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. జెడి చక్రవర్తిని ప్రేమిస్తున్నానని, ఆయనంటే ఇష్టమని, పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. దీంతో ఆ వ్యాఖ్యలు వైరల్ కావడంతో జెడి చక్రవర్తి స్పందించాల్సి వచ్చింది.

Also Read: జెడి చక్రవర్తిని ప్రేమిస్తున్నాను… పెళ్లి చేసుకుంటాను: విష్ణు ప్రియ

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News