Sunday, September 8, 2024

నేను ఏం చేయగలనో చూపిస్తాను: మంచు విష్ణు

- Advertisement -
- Advertisement -

Vishnu speech at MAA President Swearing Event

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు, ఆయన ప్యానెల్ సభ్యుల ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ డా.మోహన్ బాబు, ఆదిశేషగిరిరావు, కాజా సూర్యనారాయణ, చదలవాడ శ్రీనివాసరావు, నరేష్, సి. కళ్యాణ్, శివక‌ృష్ణ తదితరులు పాల్గొన్నారు. మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా గెలవడంపై శుభాకాంక్షలు చెబుతూ మోహన్ లాల్, కృష్ణంరాజు వంటి వారు వీడియో సందేశాలను పంపించారు.

ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. ‘ఈ గెలుపు మా నాన్నది అని చెప్పాను. నాకు ఈ విజయాన్ని అందించిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. మోహన్ బాబు కొడుకు మంచు విష్ణుగా నేను ఈ రెండేళ్లలో ఏం చేయగలనో చూపిస్తాను. నేను గెలిచిన తరువాత ప్రతీ ఒక్కరూ అభినందించారు. వారందరికీ థ్యాంక్స్. 24 క్రాఫ్ట్స్ సహకారం కావాలి.’మా’ను మరింత బలంగా తయారుచేయాలి. ఆట ఆడినప్పుడు ఎవరో ఒకరు గెలుస్తారు. ఓడుతారు. మేం గెలిచాం. అవతలి ప్యానెల్ వాళ్లు దాన్ని గౌరవించాలి. వారి సలహాలను నేను గౌరవిస్తాను. వారిలో కొంత మంది రిజైన్ చేశారు. అది దురదృష్టం. కానీ ఆట ముందుకు వెళ్తుంది. ఈ అసోసియేషన్ ఇంకా బలంగా తయారవుతుంది. ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. ఇకపై నేను గానీ, మా టీం గానీ మీడియా ముందుకు రాము. అయిపోయిన వాటి గురించి ఇక మేం మాట్లాడం. జరగబోయే పనుల గురించే చెబుతాము’ అని అన్నారు.

Vishnu speech at MAA President Swearing Event

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News