Monday, December 23, 2024

సందేశంతో పాటు వినోదాన్నిచ్చే ‘మట్టీ కుస్తీ’

- Advertisement -
- Advertisement -

హీరో విష్ణు విశాల్ హీరోగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ, సోర్ట్ డ్రామా ’మట్టి కుస్తీ’. ఐశ్వర్య లక్ష్మికథానాయిక. ఆర్‌టి టీమ్ వర్క్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌లపై మాస్ మహారాజా రవితేజతో కలిసి విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ నేపధ్యంలో హీరో విష్ణు విశాల్ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

కమర్షియల్ మసాల ఫిల్మ్…
’మట్టి కుస్తీ’ భార్య భర్తల ప్రేమ కథ. భార్యభర్తల మధ్య జరిగే ఇగో కుస్తీ. కథలో కుస్తీ స్పోర్ట్ కూడా భాగంగా వుంటుంది. కేరళలో మట్టికుస్తీ అనే స్పోర్ట్ వుంది. ఇందులో హీరోయిన్ కేరళ అమ్మాయి. అలా ఈ చిత్రానికి మట్టికుస్తీ అనే పేరు పెట్టాం. పెళ్లి తర్వాత భార్యభర్తలకు కొన్ని అంచనాలు వుంటాయి. ఆ అంచనాలని అందుకోలేనప్పుడు ఇగోలు మొదలవుతాయి. ‘మట్టి కుస్తీ’ నా కెరీర్‌లో మొదటి అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ మసాల ఫిల్మ్.
అది చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది…
ఇందులో నేను కబడ్డీ ప్లేయర్‌ని. కానీ కుస్తీ ఆటకి వెళ్తాను. అలా ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో.. సినిమా చూసినప్పుడు ఇది చాలా సర్‌ప్రైజింగ్‌గా వుంటుంది. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ బలంగా వుంటాయి. ట్రైలర్‌లో “వెయ్యి అబద్దాలాడైన ఒక పెళ్లి చేయమని చెప్పారు. కానీ రెండు అబద్దాలు ఆడి ఈ పెళ్లి చేశాం” అనే డైలాగ్ వుంటుంది. ఆ రెండు అబద్దాలు ఏమిటనేది సినిమా చూసినప్పుడే తెలుస్తుంది.

ఆ సందేశం వినోదాత్మకంగా…
సినిమాలో చాలా కామెడీ వుంది. ఒక రిలేషన్‌షిప్‌లో వున్నపుడు ఖచ్చితంగా ఇగో వుంటుంది. అయితే ఇందులో ఆడ, మగ సమానమని చెప్పే సందేశం కూడా వుంది. అయితే దీన్ని ఒక సందేశంలా కాకుండా వినోదాత్మకంగా చెప్పాం. మహిళా ప్రేక్షకులు కూడా ‘మట్టికుస్తీ’ని చాలా ఇష్టపడతారు.
రవితేజ నన్ను ఎంతో నమ్మారు…
రవితేజకు ఈ సినిమా లైన్ చెప్పగానే ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ప్రొడ్యూస్ చేస్తానని చెప్పారు. అలా జర్నీ మొదలైంది. రవితేజ నన్ను ఎంతో నమ్మారు. ఆయన నమ్మకం నాకు ఎంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చింది.
తదుపరి చిత్రాలు…
ప్రస్తుతం నా నిర్మాణంలో ఇంకా మూడు సినిమాలు వున్నాయి. మోహన్ దాస్ చిత్రం చిత్రీకరణలో వుంది. సత్యజ్యోతి దర్శకత్వంలో ఓ సినిమా వుంటుంది. జనవరిలో మరో సినిమా ప్రకటన వస్తుంది. ఇక రజనీకాంత్ ‘లాల్ సలాం’ చిత్రంలో నటిస్తున్నా.

Vishnu Vishal interview about ‘Matti Kusthi’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News