Thursday, January 23, 2025

‘షూర్ షాట్ హిట్’ అన్నారు

- Advertisement -
- Advertisement -

Vishnu Vishal Interview about 'SIR' Movie

విష్ణు విశాల్ హీరోగా రూపొందుతున్న డార్క్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఎఫ్‌ఐఆర్’. ఈ చిత్రానికి మను ఆనంద్ దర్శకత్వం వహించారు. విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌పై విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం తమిళం, తెలుగులో ఏకకాలంలో ఈనెల 11న విడుదల కానుంది. మాస్ మహారాజా రవితేజ సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరో విష్ణు విశాల్ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…
ఓకే చెప్పడంతో ఆశ్చర్యపోయారు..
దర్శకుడు మను ఆనంద్ మొదటగా ఓ యాక్షన్ ప్యాక్ట్ స్టోరీని చెప్పారు. ఇంకా వేరే ఏదైనా ఉందా? అని అడిగాను. కథ మొత్తం రెడీ కాలేదు కానీ.. ఓ లైన్ ఉందని ఆయన అన్నారు. ఆ లైన్ చెప్పడంతో వెంటనే ఓకే చెప్పేశాను. అంత సున్నితమైన కథను ఒప్పుకుంటానని ఆయన అనుకోలేదు. నేను ఓకే చెప్పడంతో దర్శకుడు ఆశ్చర్యపోయారు.
చాలా రీసెర్చ్ చేశారు..
ఈ సినిమా కోసం మను ఆనంద్ చాలా రీసెర్చ్ చేశారు. నిజ జీవితంలో ఓ ముస్లిం అబ్బాయికి జరిగిన ఘటనలను కూడా ఉదాహరణగా చూపించారు. మతాన్ని ఆధారంగా చేసుకొని ఇలాంటి ఘటనలు ఎక్కడైనా, ఎవరికైనా జరగొచ్చు. ఈ సినిమాలో మాత్రం ఏ మతాన్ని కూడా కించపరిచేలా సన్నివేశాలు లేవు.
‘షూర్ షాట్ హిట్’ అని అన్నారు
నా భార్య ఫ్రెండ్ రవితేజ వద్ద పని చేస్తుంటారు. అలా ఈ ప్రాజెక్ట్ గురించి ఆయనతో మాట్లాడాం. నా స్క్రిప్ట్ సెలెక్షన్ బాగుంటుందని రవితేజ అన్నారు. ఈ మూవీ రఫ్ కట్ చూసి ‘షూర్ షాట్ హిట్’ అని అన్నారు. ఖచ్చితంగా హిట్ అవుతుందని చెప్పారు.
మనసును తాకేలా..
సినిమాను డాక్యుమెంటరీగా తీస్తే ఎవరూ చూడరు. కమర్షియల్ పంథాలో చెప్పాలి. ఈ సినిమాలో డైలాగ్స్ మనసును తాకేలా ఉంటాయి. ప్రతి పాత్ర, ప్రతి డైలాగ్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. మేం ఏం చెప్పదలుచుకున్నామో అది అందరికీ సులభంగా అర్థమవుతుంది.
అందుకే ఈ టైటిల్..
ఓటీటీలో ప్రేక్షకులు అన్ని రకాల సినిమాలు చూసేస్తున్నారు. వారిని ఎంటర్‌టైన్ చేయాలంటే ఏదో ఒక సర్‌ప్రైజ్ ఎలిమెంట్ ఉండాలి. టైటిల్ నుంచి కూడా ఏదో ఒక కొత్తదనాన్ని ఆశిస్తుంటారు. అందుకే ఈ సినిమా టైటిల్‌ను ‘ఎఫ్‌ఐఆర్’ అని పెట్టాం.

Vishnu Vishal Interview about ‘SIR’ Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News