Thursday, December 26, 2024

ఓవైసి పై బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి మండిపాటు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుపై మజ్లీస్ పార్టీ అధినేత , ఎంపీ అసదుద్దీన్ ఓవైసి చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. హిందువులకు అత్యంత పవిత్రమైన స్థలాన్ని వక్ఫ్ బోర్డు, వక్ఫ్ కౌన్సిల్తో పోల్చడమేమిటని ఖండించారు.

టిటిడిలో ఇతర మతస్థులకు అవకాశం ఉండరాదన్న టిటిడి చైర్మన్ వ్యాఖ్యలను తప్పుబట్టిన ఓవైసి మక్కాలో హిందువులు ఎవరూ అడుగు పెట్టరాదన్న ఆంక్ష ఉందని గుర్తుచేశారు. అయితే ముస్లింలు, ఇతర మతస్థులు తిరుమలలో ప్రవేశించాలనుకుంటున్నారా? మీ మత విశ్వాసాలకు భిన్నంగా మీరు వేంకటేశ్వరుని విశ్వసిస్తున్నారా? అని నిలదీశారు.

Asaduddin Owaisi

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News