Wednesday, January 22, 2025

మహబూబ్‌నగర్ డిసిసిబి ఛైర్మన్ గా విష్ణువర్ధన్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నూతన చైర్మన్ గా మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఏకగ్రీవంగా మహబూబ్‌నగర్ డిసిసిబి ఛైర్మన్ గా ఎన్నికైన విష్ణుకు ఎన్నికల నిర్వహణ అధికారి టైటస్ పాల్ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి నూతనంగా ఎన్నికైన చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపారు. రైతు సంక్షేమానికి కృషి చేయాలని యెన్నం కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, మేఘా రెడ్డి, డాక్టర్ పర్నికా రెడ్డి, జియంఆర్, అనిరుధ్ రెడ్డి, మైనారిటీ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి వనపర్తి జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు.

Vishnuvardhan Reddy was unanimously elected as Chairman of Mahabubnagar DCCB

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News