Friday, January 10, 2025

విశ్వబ్రహ్మణులు ఐక్యంగా ఉండి సమస్యలపై పోరాడాలి

- Advertisement -
- Advertisement -

పరిగి: విశ్వబ్రాహ్మణులు ఐక్యంగా ఉండి సమస్యల పరిష్కారానికి పోరాడల్సిన సమయం ఆసన్నమైందని వికారాబాద్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు వడ్ల పాండురంగాచారి అన్నారు. పరిగి పట్టణంలోని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో గురువారం రా్ష్ట్ర సంఘం సర్వసభ్య సన్నాహాక సమావేశానికి సంబందించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జులై నెల 9వ తేదిన సికింద్రాబాద్ సీతాఫల్‌మండి సమీపంలో జిహెచ్‌ఎంసీ మల్లీపర్పస్ గార్డెన్‌లో ఉదయం 10 గంటలకు సన్నాహాక సమావేశం రాష్ట్ర సంఘం నిర్వహిస్తుందని అందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మలు తరలిరావాలని సూచించారు.

అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కన్వీనర్ మంచన్‌పల్లి వెంకటాచారి, మాతృసంఘం మహిళా కన్వీనర్ చక్కపాటి కవిత, స్వర్ణకార సంఘం పరిగి మండల అధ్యక్షులు అశోక్‌చారి, సభ్యులు మాధారం శ్రీనివాస్‌చారి, కోశాధికారి కృష్ణమాచారి, కార్పెంటర్ పరిగి మండల అధ్యక్షుడు చక్కపాటి గోపాల్‌చారి, సభ్యులు గన్నోజు గంగాధర్, పోతేదర్ బ్రహ్మం, చిన్నయ్యచారి, వీరాచారి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News