30 ఏళ్ళు దాటినా ఇంకా పెళ్లికాని అర్జున్ కుమార్ అల్లం పాత్రలో విశ్వక్ సేన్ నటించిన ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ శుక్రవారం థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో విశ్వక్ సేన్ మీడియాతో మాట్లాడుతూ “‘అశోక వనంలో అర్జున కళ్యాణం… అందరికీ కనెక్ట్ అయ్యే కథ. నా కెరీర్‌లో ఇది బెస్ట్ ఫిలిం అవుతుందని నమ్ముతున్నాను. మురారి, నిన్నే పెళ్ళాడతా సినిమాల తరహాలో ఓ పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. అమ్మాయిలు తక్కువ అయిపోవడం, అబ్బాయిలకు పెళ్లనేది ఎంత పెద్ద విషయమో అనేది ఈ సినిమాలో చెప్పాం. అర్జున్ కుమార్ అల్లం పాత్ర కోసం ఏడు కిలోల బరువు పెరగాల్సి వచ్చింది. నా తదుపరి సినిమా ‘ఓరి దేవుడా’ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. నెక్స్ నా డైరెక్షన్‌లో ‘ధమ్కి’ సినిమా చేస్తున్నాను. ఆ ప్రాజెక్ట్ షూటింగ్ స్టేజీలో ఉంది. అలాగే సాహిత్ మోత్కూరి అనే దర్శకుడితో మరో సినిమా చేయబోతున్నాను. ఆ తర్వాత ‘మాస్ కా దాస్’ అనే టైటిల్‌తో ‘ఫలక్ నుమా దాస్’కి సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నాను. అది పాన్ ఇండియా సినిమా”అని అన్నారు.
Vishwak Sen about Ashoka Vanamlo Arjuna Kalyanam