Thursday, January 16, 2025

క్రేజీ కాంబినేషన్‌లో సినిమా ప్రారంభం

- Advertisement -
- Advertisement -

Vishwak Sen and Arjun Movie begins

విశ్వక్ సేన్ కథానాయకుడిగా ఐశ్వర్య అర్జున్ కథానాయికగా యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా రచయిత, నిర్మాత, దర్శకుడిగా వ్యవహరిస్తున్న చిత్రం గ్రాండ్‌గా ప్రారంభమైంది. అర్జున్ సొంత బ్యానర్ శ్రీరామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ తెలుగులో కథానాయికగా పరిచయమవుతున్నారు. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరై క్లాప్ కొట్టి చిత్ర యూనిట్‌కి బెస్ట్ విషెస్ అందించారు. తొలి షాట్‌కి వెటరన్ దర్శకులు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా, ప్రకాష్ రాజ్ కెమెరా స్విచాన్ చేయగా, మంచు విష్ణు స్క్రిప్ట్‌ని అందజేశారు.

వీరితో పాటు బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ కార్యక్రమానికి హాజరై టీమ్‌కి బెస్ట్ విషెస్ అందించారు. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ “అర్జున్ నన్ను కలవాలని అడిగితే షాక్ అయ్యా. ఎందుకో అర్ధం కాలేదు. ’నేను డైరెక్ట్ చేస్తున్న సినిమా కథ చెబుతా విను’ అనగానే చాలా సర్‌ప్రైజ్ అయ్యా. ఈ గొప్ప కథకు నన్ను ఎంపిక చేసిన అర్జున్‌కి ధన్యవాదాలు”అని తెలిపారు. అర్జున్ సర్జా మాట్లాడుతూ “ఇన్నేళ్ళుగా నన్ను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులు, పరిశ్రమకి నా కుమార్తె ఐశ్వర్య అర్జున్‌ని పరిచయం చేస్తున్నందుకు గర్వంగా వుంది. తను ఒక తమిళ్ సినిమా, నా దర్శకత్వంలో ఒక కన్నడ సినిమా చేసింది. ఇప్పుడు తెలుగు సినిమా చేయబోతోంది. ఇది ఫీల్ గుడ్ మూవీ. మా హీరో విశ్వక్ వండర్‌ఫుల్ హీరో. త్వరలోనే టైటిల్‌ని ప్రకటిస్తాం”అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: బుర్రా సాయి మాధవ్, సంగీతం: రవి బసూర్, కెమెరామెన్: జి. బాలమురుగన్.

Vishwak Sen and Arjun Movie begins

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News