Sunday, December 22, 2024

విశ్వక్ జోరు మామూలుగా లేదుగా.. కొత్త సినిమా ప్రకటించిన మాస్ కా దాస్

- Advertisement -
- Advertisement -

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన 13వ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. దసరాతో భారీ బ్లాక్‌బస్టర్ అందించిన ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. బ్యానర్ నుంచి ప్రొడక్షన్ నెం. 8గా వస్తున్న ఈ చిత్రం గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో హై బడ్జెట్‌తో రూపొందనుంది.

నూతన దర్శకుడు శ్రీధర్ గంటా రచన, దర్శకత్వం వహిస్తున్న విఎస్ 13 విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యూనిక్ పొలిటికల్ యాక్షన్ డ్రామా. విశ్వక్ పవర్‌ఫుల్ ఐపిఎస్ ఆఫీసర్‌గా ప్రీ-లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఫైర్ బ్యాక్ డ్రాప్‌లో చూపించిన ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News