Sunday, December 22, 2024

హెచ్‌పిఎస్‌ఎల్ బ్రాండ్ అంబాసిడర్‌గా నటుడు విశ్వక్ సేన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : హెచ్‌పిఎస్‌ఎల్- ( హార్స్ పవర్ స్పోర్ట్ లీగ్ ) తెలుగు టీమ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ టాలీవుడ్ నటుడు విశ్వక్ సేన్‌ను ఆ సంస్థ ప్రకటించింది. ఆదివారం హైదరాబాద్ ఫిల్మ్ నగర్ రామానాయుడు స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో విశ్వక్ సేన్, హెచ్‌పిఎస్‌ఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ పాలడుగుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటుడు విశ్వక్ సేన్ మాట్లాడుతూ తనను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసినందుకు ధన్యవాదములు తెలియజేస్తున్నానన్నారు.

గోల్కొండ రేస్ క్లబ్‌లో తరుచూ రేస్‌కోర్స్ జరుగుతోందని, గుర్రాలకు ఉన్న ప్రాధాన్యతనే వేరన్నారు. మనకు కుక్కల కంటే ముందు నుండి గుర్రాలను పెంచుకునే వారని,అయితే నేటి ఆధునిక యుగంలో పలు అంతస్తుల భవనాలు వచ్చాక గుర్రాల స్థానంలో పెంపుడు కుక్కలను చాకుతున్నారన్నారు. సోర్ట్, ఎంటర్‌టెయిన్‌మెంట్, లైఫ్ స్టయిల్‌కు ప్రాధాన్యత నిస్తూ ముందుకు వెళ్తున్న హెచ్‌పిఎస్‌ఎల్‌కు ధన్యవాదములు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News