Saturday, November 2, 2024

అఘోర శంకర్ హిమాలయాల్లో చేసే సాహసోపేత ప్రయాణం

- Advertisement -
- Advertisement -

మాస్ కా దాస్ విశ్వక్ సేన్… విద్యాధర్ కాగిత దర్శకత్వంలో చేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ’గామి’. కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ అడ్వెంచర్ డ్రామాని వి సెల్యులాయిడ్ సమర్పిస్తోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కి అద్భుతమైన వచ్చింది. తాజాగా మేకర్స్ గామి మూవీరిలీజ్ డేట్‌ని ప్రకటించారు. ఈ చిత్రం మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ “దర్శకుడు విద్యాధర్ గామి ఈ సినిమా కోసం చాలా రీసెర్చ్ చేశాడు. సినిమాలోని ప్రతి ఎలిమెంట్ గురించి చాలా లోతుగా రాసుకున్నాడు.

ఈ సినిమాను దాదాపు నాలుగున్నరేళ్ల పాటు చేశాం. ఇంత సమయం ఇచ్చాము కాబట్టే మంచి సీజీని రాబట్టుకున్నాం. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. అయితే నిజంగానే కుంభమేళాలో ఒకరిద్దరు నేను అఘోర అనుకోని ధర్మం చేశారు. వారణాసిలో చలికి వణుకుతూ ఓ మూలకూర్చున్నప్పుడు ఓ మూసలామె భోజనం పెట్టి టీ ఇచ్చింది. సినిమా ట్రైలర్ చూశాను. మైండ్ బ్లోయింగ్ గా వుంది. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుందనే నమ్మకం వుంది. గామి సినిమా మార్చి 8న విడుదలవుతుంది. ఖచ్చితంగా అందరినీ సరికొత్తగా అలరిస్తుంది”అని అన్నారు. దర్శకుడు విద్యాధర్ కాగిత మాట్లాడుతూ “అతని అతిపెద్ద భయం మానవ స్పర్శే. అతని లోతైన కోరిక మానవ స్పర్శే.

మానవ స్పర్శ లేని జీవితాన్ని ఊహించలేం. అలాంటి సమస్య ఎదుర్కొంటున్న అఘోర శంకర్ (విశ్వక్ సేన్) హిమాలయాల్లో చేసే సాహసోపేత ప్రయాణం, దీనితో పాటు సమాంతరంగా కొన్ని పాత్రలు నడుస్తుంటాయి. వాటి ప్రయాణం అఘోర ప్రయాణంతో ఎలా ముడిపడి ఉంది, చివరగా అఘోర తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా అనేది గామి కథాంశం. ఆడియన్స్‌కి ఇప్పటివరకూ ఇవ్వని కొత్త అనుభూతిని ఇవ్వడానికి ప్రయత్నించాం”అని తెలిపారు. నిర్మాత కార్తీక్ శబరీష్ మాట్లాడుతూ “2018లో ఈ సినిమాని మొదలుపెట్టాం. క్రౌడ్ ఫండ్ మోడల్ లో ‘మను’ సినిమా సక్సెస్‌ఫుల్‌గా చేశాం. అదే మోడల్‌ని ముందుకు తీసుకువెళ్లాలని ‘గామి’ చేశాం. గామి చాలా అద్భుతమైన కంటెంట్. ప్రేక్షకులకు తప్పకుండా అలరిస్తుంది”అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News