మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లైలా’కు రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. లైలా ఫిబ్రవరి 14న బిగ్ స్క్రీన్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత సాహు గారపాటి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. “లైలా వంటి కథలు వచ్చి చాలా కాలమైంది. ఇందులో లవ్ స్టొరీ తో పాటు ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా సోను వుంటాడు. తన లవ్ స్టొరీ ఫస్ట్ హాఫ్‌లో వుంటుంది. అనుకోని కారణంగా తనని లైలాగా మార్చుకుంటాడు. ఆ కారణం చాలా ఎమోషనల్ గా వుంటుంది.
ఇక సినిమాలో ఆడల్ట్ కామెడీ అంటూ ఏమీ లేదు. రెగ్యులర్ గా మనం మాట్లాడుకున్నదే ఉంటుంది. యూత్‌ని టార్గెట్ చేశాం. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. నవ్వించాలనే ప్రయత్నంతో చేసిన సినిమా ఇది. అందులో సక్సెస్ అయ్యామని నమ్ముతున్నాం. మెగాస్టార్ చిరంజీవి ట్రైలర్ చూశారు. కొత్త ప్రయత్నం చేశామని విశ్వక్ ని మెచ్చుకున్నారు. ఆయనకి ట్రైలర్ చాలా నచ్చింది. ఇక చిరంజీవితో సినిమా మే, జూన్‌లో ప్రారంభమవుతుంది. వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తాం. అనిల్ రావిపూడి మార్క్‌లో పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమాలా వుంటుంది. వింటేజ్ చిరంజీవిలా ఆయన రోల్ ఉంటుంది.
తన కథకు తగ్గట్టుగా విశ్వక్‌ని చూపించడంలో డైరెక్టర్ రామ్ నారాయణ్ వందశాతం సక్సెస్ అయ్యాడు. సినిమాని చాలా అద్భుతంగా తీశాడు. లైలా అనే టైటిల్ దర్శకుడు స్క్రిప్ట్ రాసుకున్నప్పుడే ఫిక్స్ చేసుకున్నాడు. తను అనుకున్నది పర్ఫెక్ట్ గా చూపించాడు. లైలా పూర్తి ఎంటర్ టైనర్. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో వుంటుంది. ఇందులో మదర్ ఎమోషన్ కూడా హత్తుకునేలా వుంటుంది. సినిమా అంతా ఫన్ రైడ్‌లా వుంటుంది. రెండు గంటల పాటు హాయిగా నవ్వుకుందామని తీసిన సినిమా లైలా” అని అన్నారు.