Wednesday, January 22, 2025

లవ్,యాక్షన్ ఎంటర్‌టైనర్ మను చరిత్ర

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యంగ్ హీరో శివ కందుకూరి కథానాయకుడిగా నూతన దర్శకుడు భరత్ పెదగాని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మను చరిత్ర ‘విడుదలకు సిద్ధమవుతోంది. ప్రొద్దుటూర్ టాకీస్ బ్యానర్‌లో ఎన్.శ్రీనివాస రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో మేఘా ఆకాష్, ప్రియా వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్ కథానాయికలు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను హీరో విశ్వక్ సేన్ లాంచ్ చేశారు. ట్రైలర్ ని బట్టి చూస్తే.. ‘మను చరిత్ర’ ఒక ఇంటెన్స్ ప్రేమకథ.ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ “ట్రైలర్ చాలా ఇంటెన్స్‌గా, ప్రామిసింగ్‌గా వుంది. లవ్. యాక్షన్ నా ఫేవరేట్ జోనర్.

ఖచ్చితంగా సినిమా మంచి అనుభూతిని ఇచ్చి పెద్ద విజయం సాధిస్తుంది” అని అన్నారు. శివ కందుకూరి మాట్లాడుతూ “16న ప్రభాస్ అన్న ఆదిపురుష్ సినిమా కోసం థియేటర్‌కి వెళ్తాం. జూన్ 23న మా సినిమా వస్తుంది. అదే ఊపులో మా సినిమాని కూడా చూసి ఆదరించాలి”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్ కందుకూరి, మేఘా ఆకాష్, భరత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News