Monday, December 23, 2024

ఆగస్ట్ 6న #VS10 గ్లింప్స్ తో టైటిల్ అనౌన్స్ మెంట్  

- Advertisement -
- Advertisement -

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ మైల్ స్టోన్ మూవీ #VS10 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మొదటి షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది, రెండవ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ కు జోడిగా మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది.

ఆగస్ట్ 6 ఉదయం 11:11 గంటలకు సినిమా టైటిల్‌ను ఒక గ్లింప్స్ ద్వారా అనౌన్స్ చేస్తామని మేకర్స్ ఈరోజు అప్‌డేట్ ఇచ్చారు. ‘“High torque engine starts soon. ఆగస్ట్ 6వ తేదీ ఉదయం 11:11 గంటలకు గ్లింప్స్ తో #VS10 టైటిల్ అనౌన్స్ మెంట్ ” అని పోస్టర్ పై రాసుంది. పోస్టర్ లో విశ్వక్ సేన్ ఇంటెన్స్ లుక్ లో కనిపించారు. ఈ చిత్రం కోసం విశ్వక్ స్టైలిష్ గా మేక్ఓవర్ అయ్యారు. గడ్డం, గిరజాల జుట్టుతో కనిపిస్తున్నారు.

ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ని త్వరలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. ఫన్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. మనోజ్ కాటసాని కెమెరామెన్ గా పని చేస్తున్నారు. అన్వర్ అలీ ఎడిటర్, క్రాంతి ప్రియం ప్రొడక్షన్ డిజైనర్. సత్యం రాజేష్, విద్యాసాగర్ జె ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యుసర్స్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News