Monday, December 23, 2024

ఇదొక లెజెండరీ, అద్భుతమైన రోజు: త్రిష

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మాగ్నమ్ ఓపస్ ’విశ్వంభర’. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్ విడుదలయ్యాక అంచనాలు ఆకాశాన్ని తాకాయి. తాజాగా హైదరాబాద్‌లో ఓ కీలక షెడ్యూల్‌ను చిత్ర బృందం పూర్తి చేసుకుంది. చిరంజీవి, త్రిష కృష్ణన్ తదితరులు షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ షెడ్యూల్‌లో కొన్ని టాకీ పార్ట్, పాట, యాక్షన్ బ్లాక్‌ని చిత్రీకరించారు. చిరంజీవి నివాసంలో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణితో సహా మొత్తం బృందంతో కలిసి ఉన్న ఫొటోలను త్రిష కృష్ణన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. “ఇదొక లెజెండరీ, అద్భుతమైన రోజు! #విశ్వంభర” అని ఆమె పోస్ట్ చేశారు. చిరంజీవి, త్రిష, వశిష్ట, కీరవాణి, విక్రమ్, వంశీ, ఛోటా కె నాయుడు, ఎఎస్ ప్రకాష్ కనిపిస్తున్న మరో పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ మెగా ఫాంటసీ అడ్వెంచర్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ నిర్మిస్తోంది. విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశ్వంభర సినిమా 2025 సంక్రాంతికి జనవరి 10న విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News