Thursday, January 23, 2025

విశ్వంభర విజృంభణ, ఆగమనం

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్‌గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న భారీ విజువల్ ట్రీట్ మూవీ విశ్వంభర. సమ్‌థింగ్ స్పెషల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా పనులు అన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా వశిష్ట పెట్టిన పోస్ట్ ఒకటి ఇప్పుడు అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది. విశ్వంభర రిలీజ్ డేట్ జనవరి 10, 2025ని పెట్టి… విశ్వంభర విజృంభణ, ఆగమనం అంటూ పోస్ట్ చేశాడు. దీనితో మెగా ఫ్యాన్స్ వశిష్ట నమ్మకాన్ని చూసి ఆనందం వ్యక్తం చేస్తూ విశ్వంభరుడి ఆగమనం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ భారీ ప్రాజెక్ట్‌కి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమా నిర్మాణం వహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News