Thursday, February 20, 2025

కూల్, స్టైలిష్‌గా..

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో- ఫాంటసీ ఎంటర్‌టైనర్ ’విశ్వంభర’. ఈ సినిమా టీజర్ విడుదలైన తర్వాత ఈ మూవీపై ఉన్న భారీ అంచనాలు మరింత పెరిగాయి. ప్రతిష్టాత్మక యువి క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమా గ్రేట్ విజువల్ వండర్‌గా రూపొందుతోంది. సినిమా ప్రొడక్షన్ పూర్తి కావస్తోంది. తాజా షెడ్యూల్‌లో చిరంజీవి ఇంట్రడక్షన్ సాంగ్ హైదరాబాద్ లోని శంకర్ పల్లిలో ఒక అద్భుతమైన సెట్ లో చిత్రీకరిస్తున్నారు. ఈ పాట కోసం ప్రొడక్షన్ డిజైనర్ ఎఎస్ ప్రకాష్ ఓ మాసీవ్ సెట్ ని రూపొందించారు.

ఎంఎం కీరవాణి ఈ పాట కోసం పవర్‌ఫుల్ మాస్ అంథమ్ కంపోజ్ చేయగా, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం రాశారు. ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ శోభి మాస్టర్ డ్యాన్స్ మూమెంట్స్‌ని పర్యవేక్షిస్తున్నారు. సాంగ్ షూట్ నుంచి విడుదలైన ఫొటో చిరంజీవిని కూల్ అండ్ స్టైలిష్‌గా, షేడ్స్‌తో కారు దిగి షార్ఫ్ లుక్స్‌తో చూపించింది. బ్లాక్‌బస్టర్ బింబిసారతో అద్భుతమైన అరంగేట్రం చేసిన దర్శకుడు వశిష్ట ’విశ్వంభర’ కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ఇది తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా భావిస్తున్నారు. తన అభిమాన హీరో చిరంజీవితో కలిసి ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించారు. ఈ చిత్రంలో త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు, కునాల్ కపూర్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. సినిమాటోగ్రాఫర్ చోటా కె. నాయుడు అద్భుతమైన విజువల్స్ అందిస్తుండగా, లెజెండరీ ఎంఎం కీరవాణి ఈ ప్రాజెక్ట్‌కు సంగీతం సమకూరుస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News