Thursday, September 19, 2024

అదరగొట్టిన ‘విశ్వంభర’ ఫస్ట్ లుక్

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హైలీ యాంటిసిపేటెడ్ క్రేజీ సోషియో- ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘విశ్వంభర’ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి బిగ్ మాస్ బొనాంజాతో ముందుకు వచ్చారు. ఈ వండర్‌ఫుల్ పోస్టర్‌లో మెగాస్టార్ చిరంజీవి ఒక రాతిపై కూర్చొని, ప్రత్యేక శక్తులతో కూడిన త్రిశూలాన్ని పట్టుకుని పవర్ ఫుల్ గా కనిపించారు.

మెగాస్టార్ చరిష్మాటిక్ లుక్, కొండ నుంచి ఉద్భవించిన ప్రకాశవంతమైన దైవిక శక్తి, ఉరుములు మెరపులతో కూడిన ఈ ఫస్ట్ లుక్ అదిరిపోయింది. చిరంజీవి త్రిశూలం వైపు ఇంటెన్స్ లుక్స్ తో చూస్తూ యూత్ ఫుల్ అండ్ డైనమిక్‌గా కనిపించారు. విజువల్‌గా అద్భుతమైన ఈ ఫస్ట్‌లుక్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది. తన డెబ్యు మూవీ బింబిసారతో బ్లాక్‌బస్టర్ అందించిన దర్శకుడు వశిష్ట తన అభిమాన హీరో చిరంజీవితో కలిసి ’విశ్వంభర’ను అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా తీర్చిదిద్దుతున్నారు.

మూవీ కోసం ఒక ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను బ్లాక్‌బస్టర్ ప్రొడక్షన్ హౌస్ యువి క్రియేషన్స్ నిర్మిస్తోంది. త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్ నటిస్తుండగా, కునాల్ కపూర్ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్‌ని చాలా గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. విశ్వంభర 2025 జనవరి 10న విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News