Thursday, January 23, 2025

విజన్ 2050

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు, వైఎస్‌ఆర్, కెసిఆర్ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశారని ముఖ ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గత ముప్పై ఏళ్లుగా గత ప్రభుత్వాలు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధిలో ఎంతో అభివృద్ధి చేశారని, రాజకీయాలకు అతీతంగా గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు, అనుభవాలను ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళుతుందని చెప్పారు. అభివృద్ధి విషయంలో వారి నిర్ణయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా నానక్‌రాంగూడ లో అగ్నిమాపక సేవల శాఖ ప్రధాన కార్యాల యం, తెలంగాణ రాష్ట్ర విపత్తుల స్పందన కేంద్రం ను ఆదివారం సిఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సనత్ నగర్ అగ్నిమాపక కార్యాలయాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. అగ్నిమాపక శాఖ కేవలం అగ్ని ప్రమాదాల నివారణకే కాదని, ఎన్నో విపత్కర పరిస్థితుల్లో వారి సేవలు అమూల్యమని కితాబిచ్చారు. అగ్నిప్రమాదాల్లో సిబ్బంది ప్రాణాలకు తెగించి ప్రజలను కాపాడారని చెప్పారు. అగ్నిమాపక శాఖకు మం చి భవనం లేకపోవడం సరికాదని తెలిపారు. శాంతి భద్రతలు బాగుంటేనే నగరం అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు. హైదరాబాద్ అభివృద్ధిపై కొందరికి కొన్ని అపోహలు ఉన్నాయని, వాటి గురించి చర్చించుకుంటే ఎలాంటి ప్రయోజనం లేదని పేర్కొన్నారు. నగర శివారు ప్రాంతాలకు త్వరలోనే రీజినల్ రింగ్ రోడ్డు వస్తుందని చెప్పారు. రింగు రోడ్డు చుట్టూ మెట్రో రైలు సదుపాయం కూడా కల్పిస్తామన్నారు. హైదరాబాద్‌తో పాటు మొత్తం తెలంగాణ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. అర్బన్, సెమీ అర్బన్, రూరల్ మూడు భాగాలుగా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామన్నారు.
తెలంగాణ అభివృద్దికి మెగా మాస్టర్ ప్లాన్
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రీజినల్ రింగ్ రోడ్డును త్వరలోనే తీసుకువస్తామని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో రైల్ సదుపాయం కూడా కల్పిస్తామని హమీ ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధ్దికి మెగా మాస్టర్ ప్లాన్ తీసుకువస్తున్నామని చెప్పారు. విజన్2050 విజన్ దిశగా తాము ముందుకు వెళ్లనున్నట్లు తెలిపారు. అర్బన్, రూరల్ తెలంగాణను అభివృద్ధి చేస్తామని రేవంత్‌రెడ్డి అన్నారు.హైదరాబాద్ నగరం ప్రపంచంతో పోటీ పడుతోందని, ఇక్కడ పెట్టుబడులకు అనువైన ప్రాంతమని, అందుకే మహానగరాన్ని అర్బన్, సెమీ అర్బన్, రూరల్ మూడు భాగాలుగా అభివృద్దిలో ముందుకు తీసుకెళ్తామని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
15 ప్రాంతాల్లో ఫార్మా విలేజ్‌లు
ఫార్మాసిటీ కట్టలేదని కొంత మంది ఆరోపణలు చేస్తున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. అంతర్జాతీయ విమానాశ్రయం పక్కన ఫార్మా పరిశ్రమల ఏర్పాటు సరికాదని చెప్పారు. ఒకే చోట కాకుండా 10 నుంచి -15 ప్రాంతాల్లో ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేస్తామని, కానీ ఒకేచోట 25 ఎకరాల్లో ఫార్మాసిటీ ఉంటే నగరం కలుషితం అవుతుందని తెలిపారు. అవగాహన లేకుండా నిర్ణయాలు తీసుకుంటే, మేడిగడ్డ వలే అవుతుందని వ్యాఖ్యానించారు. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని 25 వేల ఎకరాల్లో హెల్త్, స్పోర్ట్, కాలుష్య రహిత పరిశ్రమలతో ఒక సిటీని ఏర్పాటు చేయబోతున్నామని రేవంత్‌రెడ్డి తెలిపారు. పరిపాలనపై తనకు కొంత సహాయం కావాలని, ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అపోహలు వద్దని, తమ ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉందని స్పష్టం చేశారు. ఆలోచించి నిర్ణయం తీసుకోవడం తమ విధానమని పేర్కొన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. రూ.17 కోట్లతో తెలంగాణ రాష్ట్ర విపత్తుల స్పందన, అగ్నిమాపక సేవల శాఖ ప్రధాన కార్యాలయ భవనాన్ని నిర్మించిన క్రిడామ్ హైదరాబాద్ వారిని, సనత్ నగర్ అగ్నిమాపక ఆఫీస్‌ను రూ.1.5 కోట్లతో నిర్మించిన కిమ్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ భాస్కర్ రావులను ముఖ్యమంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి పట్నం మహేందర్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ జనరల్ నాగిరెడ్డి, హోం సెక్రెటరీ జితేంద్ర, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్)శాలిని మిశ్రా, క్రిడామ్ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, కిమ్స్ చైర్మన్ అండ్ మేనజింగ్ డైరెక్టర్ భాస్కర్ రావు, ప్రతినిధులు, అగ్నిమాపక శాఖ ఆధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News