Wednesday, January 22, 2025

ప్రగతి యాత్రలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన

- Advertisement -
- Advertisement -

జగద్గిరిగుట్ట: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలోని మైసమ్మనగర్ ఏ, బీ బ్లాక్ లలో ప్రగతి యాత్రలో భాగంగా 87వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటించారు. ఈ సందర్భంగా పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన రోడ్లు, డ్రైనేజీ వంటి అభివృద్ధి పనులు పరిశీలించారు. అదే విధంగా సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కాగా అక్కడక్కడా నెలకొన్న భూగర్భడ్రైనేజీ, అంతర్గత రోడ్లు, కరెంటు పోల్స్, తీగలు మార్చాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా.. అక్కడే ఉన్న అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ గోవర్ధన్, డిఈఈ రూపాదేవి, మేనేజర్ అంకిత్ మరియు స్థానిక డివిజన్ బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీనియర్ నాయకులు, మైసమ్మనగర్ ఏ, బీ బ్లాక్ సంక్షేమ సంఘాల సభ్యులు, బస్తీల వాసులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News