- Advertisement -
సిద్దిపేట అర్బన్ : సిద్దిపేట పట్టణంలో రోజు వారి పర్యటనలో భాగంగా 23వ వార్డులో మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యూడీజీ సమస్యలను గుర్తించి యూజీడి ఎఈ పృథ్వీరాజ్‌కు తగు సూచనలు చేశారు. అనంతరం పాత బస్టాండ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
బస్టాండ్‌లో స్వీపింగ్ చేసిన చెత్తను బస్టాండ్ వెనకాల గల డ్రైనేజీలో పోస్తున్నారని తెలియడంతో డిపో మేనేజర్‌ను పిలిపించి మరల ఇలా జరిగితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే బస్టాండ్ లోపల ల్రెటీన్ వాటర్ వస్తున్నాయి అని డిపో మేనేజర్‌కు వార్నింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్స్‌పెక్టర్ వనిత, సతీష్, యూజీడి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -