Sunday, January 12, 2025

తెలంగాణలో పర్యటించండి: శ్రీలంక మంత్రిని ఆహ్వానించిన శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : కొలంబోలోని శ్రీలంక దేశ పౌర విమనయానం, నౌకాయానం, ఓడరేవుల అభివృద్ధి శాఖ మంత్రి నిర్మల్ సిరిపాల డిసిల్వతో రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు నాగార్జునసాగర్‌లో అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన బుద్ధవనం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టెంపుల్ టూరిజం, బౌద్ధ కేంద్రాల అభివృద్ధితో పాటు బుద్దిజం పూర్వ వైభవానికి చేస్తున్న కృషిపై చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నా బౌద్ద కేంద్రాలను చూసేందుకుగాను దక్షిణ ఆసియా నుండి పర్యాటకుల సౌలభ్యం కోసం శ్రీలంక నుండి హైదరాబాద్‌కు రోజువారీ విమానాలను నడపాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. రోజూ వారి విమానాలను నడపడం వల్ల చాలా మంది బౌద్ద పర్యాటకులను తెలంగాణకు ఆకర్షించటానికి, తెలంగాణ – శ్రీలంకల మధ్య సత్ సంబంధాలు మెరుగు పరిచేందుకు ఎంతో ఉపయోగ పడుతుందన్నారు.

సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో టెంపుల్ టూరిజం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా యాదాద్రి దేవాలయం, యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, ప్రపంచ ప్రఖ్యాత బుద్ధవనం, భారతదేశంలోనే అతిపెద్ద కెసిఆర్ ఏకో పార్క్‌తో పాటు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు అతి సమీపంలో ఉన్న 26 వేల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిఉన్న మహబూబ్ నగర్ జంగల్ సఫారీ పార్కు లాంటి ఎన్నో అద్భుత పర్యాటక కేంద్రాలు ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బౌద్ధ పర్యాటక కేంద్రంతో పాటు ఇతర పర్యాటక ప్రదేశాలను సందర్శించాలని శ్రీలంక దేశ పోర్టులు, పౌర నౌకా యానం పౌర విమానయాన శాఖల మంత్రి నిర్మల్ సిరిపాల డిసిల్వని మర్యాదపూర్వకంగా మంత్రి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రంలో బుద్ధిజం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యల పట్ల శ్రీలంక దేశ మంత్రి నిర్మల్ సిరిపాల డిసిల్వా రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ని అభినందించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి మేరకు తెలంగాణలో త్వరలో పర్యటించేందుకు సానుకూలంగా స్పందించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News