Monday, December 23, 2024

బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించిన కలెక్టర్

- Advertisement -
- Advertisement -

బిచ్కుంద: జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను గురువారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సందర్శించారు. ఈ సందరర్భంగా కళాశాల ప్రాంగణమంతా తిరిగి కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. కళాశాలలో విద్యుత్ సమస్య పరిష్కారం కోసం నూతన ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయడం, కంప్యూటర్ ల్యాబ్ అభివృద్ధ్ది చేస్తానని, విద్యార్థులకు మంచినీటి కోసం నూతన ఆరో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.

ఇతరులపై ఆధారపడకుండా ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులచే కళాశాలలో మొక్కలు నాటించాలని, హరిత హారంలో భాగంగా ప్రతి సంవత్సరం వెయ్యి మొక్కలు నాటి కళాశాలను హరిత వనంగా మార్చాలని కలెక్టర్ సూచించారు. కళాశాలలో లైబ్రరీ, పచ్చదనం పరిశుభ్రతను చూసి అభినందించారు. అటానమస్ సాధించినందుకు కళాశాల ప్రిన్సిపాల్ చంద్రముఖర్జీని అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, ప్రిన్సిపాల్ తదితరులు కలెక్టర్‌ను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ టి.శ్రీనివాస్, అధ్యాపకులు, తహసీల్దార్, ఎంపీడీవో, ఎపీవో, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News