Tuesday, January 14, 2025

వడగళ్ల వానకు దెబ్బతిన్న విస్తారా విమానం

- Advertisement -
- Advertisement -

వడగళ్ల వానకు దెబ్బతిన్న విస్తారా విమానం

భువనేశ్వర్: ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి బుధవారం న్యూఢిల్లీ బయల్దేరిన విస్తారా ఎయిర్‌లైన్స్ విమానం వడగళ్ల వానలోచిక్కుకుని వెనుకకు మరలి మళ్లీ భువనేశ్వర్ విమానాశ్రయంలో అత్యావసరంగా ల్యాండ్ అయింది. వడగళ్ల వాన వల్ల విమానానికి నష్టం జరిగినట్లు ఎయిర్‌లైన్స్ అధికారి ఒకరు తెలిపారు. విమానంలో ఉన్న 69 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నారని ఆయన చెపారు.

బిజూ పట్నాయక్ అతంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరిన విమానం 10 నిమిషాలకే వాపసు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వడగళ్ల వాన వల్ల విమానం విండ్‌షీల్డ్ బీటలు వారినట్లు ప్రాథమిక సమాచారం. విమానం విండ్‌షీల్డ్ దెబ్బతిందని, ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారని బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం డైరెక్టర్ ప్రసన్న ప్రధాన్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News