Thursday, January 23, 2025

విస్తారా విమానానికి బాంబు బెదరింపు

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం నుంచి ముంబయి వస్తున్న విస్తారా విమానానికి శుక్రవారం బాంబు బెదరింపు వచ్చిందని, దానితో విమానంలో గాలింపు జరుగుతోందని ముంబయిలో పోలీసులు వెల్లడించారు. ‘విమానంలో బాంబు ఉన్నది’ అని రాసి ఉన్న ఒక పత్రం ఒక సిబ్బంది కంట పడిందని సహర్ పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు తెలియజేశారు. విమానం శుక్రవారం మధ్యాహ్నం సుమారు 3.15 గంటలకు ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిందని విమాన సంస్థ పోలీసులకు చెప్పినట్లు ఆయన తెలిపారు. విమానం దిగిన తరువాత ఆ బెదరింపు గురించి ప్రయాణికులకు తెలియజేసినట్లు, ప్రయాణికులను, వారి లగేజీని తనిఖీ చేస్తున్నట్లు, అయితే, ఇంత వరకు అనుమానిత వస్తువు ఏదీ కనిపించనట్లు అధికారి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News