విశ్వ కార్తికేయ హీరోగా, సీనియర్ నటి ఆమని మేనకోడలు హ్రితిక శ్రీనివాసన్ హీరోయిన్‌గా చలపతి పువ్వల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అల్లంత దూరాన’. ఆర్.ఆర్. క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై కోమలి సమర్పణలో నిర్మాత ఎన్. చంద్రమోహనరెడ్డి తెలుగు, తమిళ భాషలలో నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్నాయి. త్వరలో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ చిత్రం టీజర్‌ను హాస్యనటుడు అలీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ ‘అల్లంత దూరాన‘ చిత్రం చక్కటి ప్రేమకథతో విజువల్ ఫీస్ట్‌గా ఉంటుందని పేర్కొన్నారు. చిత్ర దర్శకు డు చలపతి పువ్వల మాట్లాడుతూ “నిర్మాత చంద్రమోహన్ రెడ్డి మంచి నటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసుకునే విషయంలో కూడా నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. దానివల్లే నేను అనుకున్నవిధంగా విజువల్ ఫీస్ట్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించగలిగాను”అని అన్నారు. చిత్ర నిర్మాత ఎన్. చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ తెలుగుతో పాటు తమిళంలో కూడా రూపొందించిన ఈ చిత్రం మా అంచనాలను నిలబెడుతుందన్న నమ్మకం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యదర్శి కె.ఎల్.దామోదరప్రసాద్, హీరో విశ్వ కార్తికేయ, హీరోయిన్ హ్రితిక శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు.
చక్కటి ప్రేమకథతో విజువల్ ఫీస్ట్
- Advertisement -
- Advertisement -
- Advertisement -