కోల్‌కతా: ముగ్గురు విద్యార్థులను బహిష్కరిస్తూ ఆగస్టు 23న ఇచ్చిన ఆదేశాలను నిలిపివేస్తున్నట్టు విశ్వభారతి యూనివర్సిటీ అధికారులు తెలిపారు. మూడేళ్లపాటు బహిష్కరిస్తున్నట్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేసి విద్యార్థులను తరగతులకు అనుమతించాలని కోల్‌కతా హైకోర్టు ఈ నెల 8న తీర్పు ఇచ్చింది. దాంతో, యూనివర్సిటీ అధికారులు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. విద్యార్థులపై కఠిన శిక్షలు తగదని హైకోర్టు తన తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది. దాంతో, ఆర్థికశాస్త్రంలో పిజి విద్యార్థులైన సోమనాథ్‌సౌ, ఫాల్గుణిపన్, సంగీత విభాగానికి చెందిన రూపా చక్రవర్తి తిరిగి తరగతులకు హాజరు కానున్నారు. విశ్వభారతిలో ఈ ఏడాది జనవరి 9న జరిగిన ఓ ఆందోళనలో ఈ విద్యార్థులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ అధికారులు బహిష్కరణ వేటు వేశారు. విద్యార్థుల బహిష్కరణను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీలో ఆగస్టు 27నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
విద్యార్థుల బహిష్కరణను నిలిపివేసిన విశ్వభారతి యూనివర్సిటీ
- Advertisement -
- Advertisement -
- Advertisement -