డైరెక్టర్ శ్రీను వైట్ల కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను డీల్ చేయడంలో ఎక్స్‌పర్ట్. ముఖ్యంగా కామెడీని హ్యాండిల్ చేయడంలో దిట్ట. మాచో హీరో గోపీచంద్‌తో శ్రీను వైట్ల రూపొందిస్తున్న స్టైలిష్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘విశ్వం’. మేకర్స్ ఈ సిని మా టీజర్‌ను రిలీజ్ చేశారు. టీజర్ నరేష్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైంది. గోపీచంద్, కావ్యా థాపర్ పాత్రల పరిచయం, వారి క్యారెక్టర్స్‌లో కామెడీ స్పార్క్ ఆకట్టుకున్నాయి.
టీజర్‌లో ప్రముఖ నటీనటులతో కామెడిక్ సీన్స్ హిలేరియస్‌గా వున్నా యి. టీజర్ చివరి భాగంలో యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అదిరిపోయాయి. గోపీచంద్ అల్ట్రా-స్టైలిష్ గా కనిపించారు. కావ్య థాపర్ తన గ్లా మర్‌తో ఆకట్టుకోగా, నరేష్, వెన్నెల కిషోర్, మిగతా నటులు వినోదాన్ని అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్ పై నిర్మా త టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ నిర్మాణ విలువలు టాప్ క్లాస్‌లో వున్నాయి. ‘విశ్వం’ అక్టోబర్ 11న దసరాకి విడుదల కానుంది.