Wednesday, January 15, 2025

‘విశ్వంభర’! రిలీజ్ ఎప్పుడంటే?

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీ షూటింగ్ చకచకా సాగుతోంది. ఈ మూవీ కోసం చిరంజీవి తన శక్తియుక్తులన్నీ ధారపోస్తున్నారు. తాజాగా తాను జిమ్ లో కసరత్తులు చేస్తున్న దృశ్యాలను ఎక్స్ లో విడుదల చేయగా, ఇవి వైరల్ అయ్యాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న విశ్వంభర మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి10న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు తాజాగా ప్రకటించారు. దీంతో చిరు అభిమానుల్లో జోష్ వచ్చింది. చిత్ర యూనిట్ షేర్ చేసిన పోస్టర్ కూడా వైరల్ అవుతోంది. ‘అతీత శక్తుల పోరాటం నుంచే లెజెండ్స్ అవతరిస్తారు’ అంటూ ఈ పోస్టర్ ను షేర్ చేశారు. ఈ మూవీలో చిరు పక్కన మొదటిసారిగా అనుష్క శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News