చలికాలంలో విటమిన్ డి లోపం సర్వసాధారణం అని చెప్పవచ్చు. కానీ, ఈ లోపం వల్ల వచ్చే లోపాలు చాలా భయంకరంగా ఉంటాయి. విటమిన్ డి మన మొత్తం శరీరానికి చాలా ముఖ్యమైనది. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా అనేక వ్యాధులకు దూరం చేస్తుంది. విటమిన్ డి మన శరీరాన్ని ఉత్సాహంగా, దృడంగా, శక్తిని ఇవ్వడంలో ఎంతో సహాయపడుతుంది. ఎముకలు దృఢంగా ఉండేలా విటమిన్ డి పనిచేస్తుంది. అయితే, దీని లోపం మన శారీరక స్థితిని ప్రభావితం చేయడమే కాకుండా మెదడును కూడా దెబ్బతీసే తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుంది. దాని సంకేతాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
విటమిన్ డి లోపం వల్ల ఎముకలు, కీళ్లలో నొప్పి వస్తది. ఇది చిన్నదే కానీ ముఖ్యమైన సంకేతం. బలహీనమైన ఎముకలు, కీళ్ళు దీర్ఘకాలిక నొప్పి, దృఢత్వానికి దారి తీయవచ్చు. ఇది మనం చేసుకునే రోజువారీ పనులకు అంతరాయం కలిగిస్తుంది.
నిరంతర అలసట అనిపిస్తే అది విటమిన్ డి లోపం లక్షణం అని చెప్పవచ్చు. విటమిన్ డి లోపం శరీరంలో శక్తి లోపానికి కారణమవుతుంది. దీని కారణంగా.. రోజంతా శారీరకంగా, మానసికంగా అలసిపోతారు.
ఆకలి లేకపోవడం, ఆహారం పట్ల ఆసక్తి కోల్పోవడం కూడా మీ శరీరంలో విటమిన్ డి లోపం ఉన్నట్లే. విటమిన్ డి తక్కువ స్థాయిలో హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. ఇది ఆకలి, జీవక్రియలో మార్పులకు కూడా దారితీస్తుంది.
విటమిన్ డి లోపాన్ని ఎలా నివారించాలి?
శరీరంలో విటమిన్ డి స్థాయిని పెంచుకోవడానికి సూర్యరశ్మి సహజమైన మార్గం. యువిబి కిరణాలు విటమిన్ డి లోపాన్ని భర్తీ చేయడంలో సహాయపడుతుంది. ఉదయమే లేదా సాయంత్రం ఎండలో కేవలం 10 నుండి 15 నిమిషాలు బయట ఉండడం వల్ల శరీరం శక్తివంతంగా ఉంటుంది.
సాల్మన్, సార్డినెస్ వంటి చేపలలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఇది విటమిన్ డి స్థాయిలను పెంచడంలో ఎంతో సహాయపడుతుంది. ఈ చేపలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాకుండా.. ఇది శరీరాన్ని అనేక వ్యాధుల నుండి దూరంగా ఉంచుతుంది.